Tanager and Girijan Co-operative Corporation Limited to improve incomes of 6000 tribal cashew farmers in Andhra Pradesh

In Business, News

అగ్రిబిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషన్ (ASI) పేరుతో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాభాపేక్ష రహిత సంస్థ – టనజర్ ఈరోజు జీడిమామిడి మార్కెటింగ్ వ్యూహం మీద ఒక వర్క్ షాప్ నిర్వహించింది. మొత్తం రూ. 21 కోట్ల విలువైన 1500 మెట్రిక్ టన్నుల జీడిమామిడి సేకరణ ఏర్పాటు ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన 3 మండలాల్లోని 6000 మంది గిరిజన జీడిమామిడి రైతుల ఆదాయం పెంపొందించే లక్ష్యంగా నిర్వహించిన ఈ వర్క్ షాప్‌ని గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పోరేషన్ లిమిటెడ్ (GCC)తో కలసి నిర్వహించింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) మరియు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) సాయంతో వాల్మార్ట్ ఫౌండేషన్ మద్దతు ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఫార్మర్ మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (APFMRP) పేరుతో టనజర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమం రూపొందించారు. SERP, FPOలు, లైన్ డిపార్ట్మెంట్స్ మరియు ఓలమ్, కైలాశ్ ఏజెన్సీస్, అగ్రి ప్రోడక్ట్స్, ఆల్ఫా కాజూ ఇండస్ట్రీస్, భానూ ప్రకాశ్ సోప్ వర్క్స్ మరియు సేక్రెడ్ ఎర్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి 10 ప్రముఖ కొనుగోలు సంస్థలతో సహా 52 మంది భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఈ వర్క్ షాప్ గురించి గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పోరేషన్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి. బాబూరావ్ నాయుడు (I.A.S.)  మాట్లాడుతూ, గిరిజన్ రైతుల అభివృద్ధి లక్ష్యంగా GCC పని చేస్తోంది. మద్దతు ధర అందించి మార్కెట్‌ని రైతుల ముంగిటకే తీసుకురావడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు రెట్టింపు చేయడంతో పాటు వినియోగదారులకి మెరుగైన సహజ ఉత్పత్తి అందించడం కోసం మేము వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. జీడిమామిడి రైతులకి మెరుగైన జీవితం అందించడానికి టనజర్‌తో కలసి మేం నిర్థేశించుకున్న లక్ష్యంలో భాగంగా ఈ మార్కెటింగ్ వర్క్ షాప్ తలపెట్టాం. ఈ సీజన్‌లో 1000 మెట్రిక్ టన్నుల జీడిమామిడి సేకరణ ద్వారా మేము ఈ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నాం అని అన్నారు.

ప్రధానంగా జీడిమామిడి పండించే రంపచోడవరం, గండవరం మరియు అడ్డతీగల అనే 3 మండలాల వారికి మెరుగైన ధరలు లభించే పరిస్థితి సృష్టించే వ్యూహాన్ని అభివృద్ధి చేయడమే ఈ జీడిమామిడి మార్కెటింగ్ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యం. రంపచోడవరం ఫార్మర్ ప్రొడ్యూసర్ మ్యూచువల్లీ ఎయిడెట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, అడ్డతీగల అగ్రికల్చర్ అండ్ అలైడ్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మరియు గండవరం అగ్రికల్చర్ అండ్ అలైడ్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే 3 ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థలని దత్తత తీసుకోవడం మరియు వాటి అభివృద్ధికి కృషి చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నారు. సేకరణ మరియు విక్రయాల కార్యకలాపాల సమయంలో, GCCతో మద్దతు మరియు భాగస్వామ్యంతో సహకార మార్కెటింగ్ ప్రక్రియని అనుసరించడం ద్వారా FPOలు మధ్యవర్తుల జోక్యం నుంచి తప్పించుకోవడంతో పాటు నమోదిత రైతులకి MSP మీద అధికంగా లభిస్తుంది. అలాగే, వాళ్లు ఆన్‌లైన్ లావాదేవీలు కూడా నిర్వహించవచ్చు.

ఈ కార్యక్రమం గురించి టనజర్ కంట్రీ రెప్రజెంటేటివ్ శ్రీ అమిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్‌లోని గిరిజన రైతులకి మెరుగైన ఆదాయాలు లభించేలా చేయడం కోసమే APFMRP ప్రాజెక్ట్ అమలుచేయబడుతోంది. అలాగే, ఈ కార్యక్రమం ద్వారా ఆ రైతులకి మేము సంస్థాగత మార్కెటింగ్ మరియు విక్రయ వేదిక అందించనున్నాం.ఈ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రముఖ కొనుగోలుదార్లని సంప్రదించడం ద్వారా రైతులు వారి జీడిమామిడి ఉత్పత్తికి మెరుగైన ధర పొందడంతో పాటు మార్కెట్ సంసిద్ధత గురించి కూడా తెలుసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను  అన్నారు.

గిరిజన రైతుల నుంచి జీడిమామిడి సేకరణ కోసం సహకారం మరియు సంబంధాల కోసం పెద్ద సంఖ్యలో ప్రముఖ కొనుగోలుదార్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఉమ్మడి వేదిక మరియు అనుకూల వాతావరణాన్ని కూడా ఈ కార్యక్రమం అందించింది.GCCతో జరిగిన ఒక పరస్పర అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం, ఆ సంస్థ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు సేకరించడంతో పాటు మిగిలిన 500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని మెరుగైన ధరలకి కొనుగోలు చేసే ఇతర సంస్థాగత కొనుగోలుదార్లకి విక్రయించడం జరుగుతుంది.

చివరగా, ఈ కార్యక్రమంలో భాగంగా సేకరణ ప్రక్రియ, నాణ్యత నియంత్రణ యంత్రాంగం, చెల్లింపు పద్ధతి, ప్రతి భాగస్వామి బాధ్యతలని నిర్వహించడం, కొనుగోలుదార్ల పర్చేజ్ ఇండెంట్, మార్కెటింగ్ మ్యాప్ మరియు రూట్ మ్యాప్ మరియు లాజిస్టిక్స్ నిర్వహణ లాంటి నెల-పొడవూ ముఖ్యమైన కార్యక్రమ అంశాలని సైతం ఖరారు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ఫార్మర్ మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్ APFMRP గురించి:

ఆంధ్ర ప్రదేశ్ ఫార్మర్ మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (APFMRP) అనేది అగ్రిబిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అని అధికారంగా పిలబడే టనజర్‌కి చెందిన రెండు-సంవత్సరాల ప్రాజెక్ట్. వాల్మార్ట్ ఫౌండేషన్ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ 2018 డిసెంబర్ నుంచి మొదలైంది. 15000 మంది రైతులు, 5000 మంది మహిళా రైతులు మరియు 9FPOలు లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు. మార్కెట్ సంసిద్ధ సాధించడం మరియు తమ ఉత్పత్తి కోసం విభిన్న మార్కెట్లకి చేరువ కావడానికి అవసరమైన పరిజ్ఞానం, వనరులు మరియు సేవలు అందించడం ద్వారా రైతుల ఆదాయాలని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (PFOలు) మరియు లక్షిత విలువ గొలుసుల్లో సరఫరా మరియు డిమాండ్ అవరోధాల పరిష్కారానికి సరఫరా గొలుసు పరిష్కర్తల సామర్థ్య నిర్మాణం లాంటివి ఈ లక్ష్యంలో భాగంగా ఉంటాయి. ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP)తో భాగస్వామ్యంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రోగ్రామ్ (APRIGP) కింద ఏర్పాటైన FPOలతో సైతం టనజర్ కలసి పనిచేస్తోంది. జీడిమామిడి, మొక్కజొన్న, వేరుశెనగ, కాఫీ మరియు కూరగాయలు పండించే రైతుల అభివృద్ధి కోసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం మరియు విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ITDAతో కూడా టనజర్ కలసి పనిచేస్తోంది.

###

ACDI/VOCAకి అనుబంధమైన టనజర్ ఒక అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థ. జీవితాల్లో మార్పు తీసుకురాగల ఆర్థిక మరియు సామాజిక అవకాశాల సహ-సృష్టి కోసం ప్రజల పరస్పర సహకారాన్ని ఒకే వేదిక మీదకు తీసుకొస్తుంది. మా భాగస్వాములతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా, మార్కెట్ అందుబాటుని విస్తరించేలా మరియు విశ్వసనీయ సరఫరా గొలుసులు, స్థిరమైన ఆదాయాలు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, మరియు స్థితిస్థాపక సమాజాల నిర్మాణానికి సహకరించే భాగస్వామ్య మార్కెట్ అవకాశాల పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికి తీసేలా ఆసక్తులని మేము సర్ధుబాటు చేస్తాం. 1993లో స్థాపితమైనప్పటి నుంచి ప్రజలకి వ్యవసాయాన్ని ఒక మెరుగైన పనిగా మార్చడం కోసం మేము ACDI/VOCA కంపెనీల కుటుంబంతో కలసి పనిచేస్తున్నాం. ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడం కోసం మా భాగస్వాములతో కలసి పనిచేసే దార్శనికత మరియు శ్రద్ధ కలిగిన స్థానిక నిపుణులు మరియు అంతర్జాతీయ సలహాదారుల బృందాలని మేము అందిస్తాము.

సంప్రదించండి: కమ్యూనికేషన్ మేనేజర్

అదితి డే దత్తా

మొబైల్: 9711306389/ 7518501638

adey@tanagerintl.org

https://tanagerintl.org/

You may also read!

Food For Two – Actress Sakshi Agarwal participated in Lets Feed the HUNGRY together on World Hunger Day

Awareness campaign is an initiative by Goodness Foundation (GoFo). Goodness Foundation works for the development of the

Read More...

TONI & GUY Essensuals inaugurated by Actor Vaibav @ Mount Road, chennai

The Global hairdressing/Salon Brand of the Young’ and senior citizens, now forays into India. Toni & Guy by Essensuals, a premium specialty salon

Read More...

Leave a reply:

Your email address will not be published.

Mobile Sliding Menu